e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

మొగుళ్ళపల్లి: నవంబర్ 09, (మన భారత్):

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో. మొగుళ్లపల్లి చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు ప్రజలకు పంపిణీ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం మొగుళ్ళపల్లి మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ. దేశం గర్వించదగ్గ రాష్ట్రంగా తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి మచ్చలేని మంచి మనసున్న నాయకుడుగా ధర్మ పాలనను తనదైన శైలిలో రాష్టంలో కొనసాగిస్తూ. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రజల ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఉండాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటూ మొగుళ్ళపల్లి మండల ప్రజలకు దీపావళి, శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, యూత్ నాయకులు, రేవంత్ రెడ్డి అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE