e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

వృద్ధాశ్రమంలో సీఎం జన్మదిన వేడుకలు..

కేఆర్‌కే కాలనీ వృద్ధాశ్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసిన డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 8, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 57వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్‌కే కాలనీలో ఉన్న వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ సోయం బాపూరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు వృద్ధాశ్రమానికి చేరుకుని అక్కడి వృద్ధులతో కొంత సమయం గడిపారు. అనంతరం వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి పండ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని సేవా కార్యక్రమంతో జరుపుకోవడం ద్వారా వృద్ధుల పట్ల తమ అభిమానాన్ని, సామాజిక బాధ్యతను చాటుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆదిలాబాద్ ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE