e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

ప్రత్యేక నమోదు శిబిరాల ద్వారా అర్హులందరికీ అవకాశం కల్పించాలి: కలెక్టర్ రాజర్షి షా

మన భారత్, ఆదిలాబాద్:

జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా జిల్లావ్యాప్తంగా అర్హులైన కుటుంబాలందరినీ గుర్తించి నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీతో పాటు మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అర్హులైన ఒక్క కుటుంబం కూడా పథకానికి దూరం కాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు పథకంపై అవగాహన కల్పిస్తూ, నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.

ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డు కలిగిన కుటుంబాలతో పాటు రేషన్ కార్డు లేని అర్హులైన కుటుంబాలకు కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆధార్ ఆధారిత ఓటీపీ (OTP) ధ్రువీకరణ ద్వారా కొత్తగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు.

అర్హత కలిగిన కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన వివరాలు సమర్పించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE