e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

ఎల్లారెడ్డిపేట మండలాన్ని కరువు మండలాల జాబితాలో చేర్చాలి

బిజెపి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేటలో నిరసన..

రాజన్న సిరిసిల్ల జిల్లా 28 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలాన్ని కరువు మండలాల జాబితాలో చేర్చాలని భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంగళవారం కరువు మండలాలను ప్రకటించిన జాబితాలో ఎల్లారెడ్డిపేట మండలం లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో కూడా 35% శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయిందని, వర్షాకాలం లోనే చాలామంది రైతులు వరి పొలాలు ఎండిపోయాయన్నారు. కాబట్టి రైతుల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని సాగునీరు,తాగునీరు కూడ ఈ మండలంలో ఇబ్బంది వస్తుందని అధికారులు,రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఎల్లారెడ్డిపేట మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట శాఖ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి దాసరి గణేష్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉడుగుల యాదగిరి,ఉపాధ్యక్షులు బాలా గౌడ్, సీనియర్ నాయకులు బందరపు లక్ష్మారెడ్డి, రావుల గాల్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ గంట బాలకృష్ణ గౌడ్, మండల ఉపాధ్యక్షులు నేవూరి శ్రీనివాస్ రెడ్డి, మారావేణి రంజిత్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు వంగల రాజిరెడ్డి,సాగర్ గౌడ్,సాజిత్, రాకేష్,అంతర్పుల తిరుపతి, పరశురాం రెడ్డి, దేవయ్య, హనుమంతు,రాకేష్,రాజు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE