e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్యే సంఘీభావం..

మన భారత్, ఆదిలాబాద్ రిమ్స్: అక్టోబర్ 28: ఆదిలాబాద్ జిల్లా DMHO కార్యాలయం ఎదుట నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సంఘీభావం తెలిపారు. NHM JAC ఆధ్వర్యంలో ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె బుధవారానికి 16వ రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజారోగ్య వ్యవస్థలో NHM ఉద్యోగులు కీలకంగా పనిచేస్తున్నారని, దాదాపు రెండు దశాబ్దాలుగా వైద్య, ఆరోగ్య సేవల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నప్పటికీ వారి సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాకపోవడం ఆందోళనకరమని అన్నారు.

2022 తర్వాత NHM ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు మంజూరు కాలేదని పేర్కొంటూ, దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సేవా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

మహిళా NHM ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల ఇతర న్యాయమైన డిమాండ్లను కూడా సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు.

NHM ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున తమ మద్దతు కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, వారి హక్కుల సాధన కోసం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమ్మెకు దారితీసిన అంశాలపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి పరిష్కార మార్గం చూపాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE