e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

ఏఐసీసీ అబ్జర్వర్ మరియప్పన్‌కు ఘన సన్మానం..

పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలపై కాంగ్రెస్ నాయకుల చర్చ

మన భారత్, ఆదిలాబాద్: ఏఐసీసీ అబ్జర్వర్ శ్రీ మరియప్పన్‌ను ఆదిలాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ నివాసంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. బుధవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొని మరియప్పన్‌ను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా సాజిద్ ఖాన్‌తో పాటు పార్టీ కోఆర్డినేటర్ శ్రావణ్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, ఎస్సీ సెల్ విభాగం ఉపాధ్యక్షుడు దుర్గం శేఖర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతన్ రావు, వార్డు ప్రెసిడెంట్ శ్యామ్ జాదవ్ తదితరులు మరియప్పన్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

సన్మాన కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ నాయకులు పరస్పరం ఆత్మీయంగా కలుసుకున్నారు. జిల్లాలో పార్టీ కార్యకలాపాలు, సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం సందర్భంగా ఏఐసీసీ అబ్జర్వర్ మరియప్పన్‌తో జిల్లా కాంగ్రెస్ నాయకులు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE