e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

అనారోగ్యంతో జర్నలిస్టు మృతి..

కుటుంబానికి తోటి జర్నలిస్టుల ఆర్థిక సాయం.

ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 06 (మన భారత్ ప్రతినిధి ): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోలమద్ది గ్రామానికి చెందిన జర్నలిస్టు ఏడబోయిన నారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తోటి జర్నలిస్టులు మానవతా దృక్పథంతో స్పందించారు.
నారాయణ కుటుంబానికి అండగా నిలిచేందుకు మండలంలోని టీయూడబ్ల్యూజే–ఐజేయూ జర్నలిస్టులు తమ వంతు సహాయాన్ని అందించారు. మండల జర్నలిస్టులంతా కలిసి సేకరించిన రూ.10 వేల నగదును మృతుడి భార్య సరితకు అందజేశారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ, జర్నలిస్టు కుటుంబానికి ఆపద సమయంలో తోటి జర్నలిస్టులు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. నారాయణ కుటుంబానికి తమవంతు సహాయాన్ని అందించామని, భవిష్యత్తులోనూ అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐజేయూ మండల అధ్యక్షుడు అబ్దుల్ రహీమ్, జర్నలిస్టు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ మహేష్ చంద్ర, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్సీ ఇన్‌చార్జ్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE