ఉద్యమకారులను మోసం చేస్తే సహించం..

Published on

-Advertisement-

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి

మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 24, (మన భారత్):

ఆంధ్ర పెత్తందారి పాలకుల వ్యవస్థ నుండి తెలంగాణను విముక్తి చేసేందుకు పోరాటం చేసిన ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని, వారి త్యాగానికి ప్రతి రూపకంగా హక్కులను కాపాడుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల పట్ల చిన్నచూపు చూస్తుందని, తెలంగాణ ఉద్యమకారులకు మోసం చేయాలని చూస్తే ఎంత మాత్రం సహించి ఊరుకోబమని, తెలంగాణ ఉద్యమకారుల హక్కులను కాపాడేందుకే చలో యాదగిరిగుట్ట కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి మండలంలోని మలిదశ తెలంగాణ ఉద్యమకారులంతా భారీగా తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సంఘం నాయకులతో కలిసి ఆయన ఈ నెల 27న ఆదివారం యాదగిరిగుట్ట సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రాంగణంలో జరపతలపెట్టిన చలో యాదగిరిగుట్ట వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ వీరయోధులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. మలిదశ ఉద్యమంలో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని ఎంతోమంది యువకులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, కర్షకులు, సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారన్నారు. వారు చేసిన పోరాట పటిమను గుర్తించి..ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలతో పాటు, ఉద్యమ కాలంలో వారిపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను గుర్తించని ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్ధకమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సంఘం నాయకులు బత్తిని శ్రీహరి గౌడ్, గాలి చంద్రమౌళి, తిప్పి రెడ్డి కృష్ణారెడ్డి, గుర్రపు అన్నారెడ్డి, గుడిమల్ల రమేష్, ఉడుత మల్లయ్య, కుమ్మరి సారయ్య, మంగళపల్లి శ్రీనివాస్, పావురాల రాజయ్య, బండారి బిక్షపతి, క్యాతరాజు రమేష్, కమలాకర్, కుమార్ యాదవ్, పడిదల నర్సింగారావు, మోరే కుమార్, కుమ్మరి సమ్మయ్య, జంగే చందర్ ,తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్, మన భారత్, జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

అడవిపందుల బీభత్సం.. సోయా పంట ధ్వంసం

ఎకరం సోయా పంట నాశనం.. ఆందోళనలో రైతు మన భారత్, సెప్టెంబర్ 25, తలమడుగు: అడవిపందుల బెడదతో సోయాబీన్ రైతు...

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు...

రోస్టర్ విధానం పాటించాలని వినతి..

ప్రీ ప్రైమరీ పోస్టుల నియామకాల్లో పారదర్శకత పాటించాలి సరైన రోస్టర్‌ విధానాన్ని పాటించి అర్హులైన వారికి అవకాశం కల్పించాలి: బీఆర్‌ఎస్‌...

బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్ట్..

కేటీపీపీ సందర్శనకు బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతలు అరెస్ట్ మన భారత్, భూపాలపల్లి: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపు మేరకు కాకతీయ...

More like this

అడవిపందుల బీభత్సం.. సోయా పంట ధ్వంసం

ఎకరం సోయా పంట నాశనం.. ఆందోళనలో రైతు మన భారత్, సెప్టెంబర్ 25, తలమడుగు: అడవిపందుల బెడదతో సోయాబీన్ రైతు...

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు...

రోస్టర్ విధానం పాటించాలని వినతి..

ప్రీ ప్రైమరీ పోస్టుల నియామకాల్లో పారదర్శకత పాటించాలి సరైన రోస్టర్‌ విధానాన్ని పాటించి అర్హులైన వారికి అవకాశం కల్పించాలి: బీఆర్‌ఎస్‌...