కేటీపీపీ సందర్శనకు బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతలు అరెస్ట్
మన భారత్, భూపాలపల్లి: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపు మేరకు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ) సందర్శనకు బయలుదేరిన బీఆర్‌ఎస్ నాయకులను చిట్యాల మండల కేంద్రంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, విద్యుత్ కోతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు గణపురం మండలం చెల్పూర్‌లోని కేటీపీపీ (జెన్కో) సందర్శనకు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చిట్యాల మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అల్లం రవీందర్ మాట్లాడుతూ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. “ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడమే” అంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అరెస్టైన వారిలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అల్లం రవీందర్, మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, మండల ప్రధాన కార్యదర్శి మడికొండ రవీందర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు, మండల యువజన అధ్యక్షుడు తౌటం నవీన్, టౌన్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీధర్ గౌడ్, జూకల్ సర్పంచ్ ఎలగొండ తిరుపతి, మాజీ సర్పంచ్ పుట్టపాక మహేందర్, సీనియర్ నాయకులు సాధ మల్లయ్య, వేముల శ్రీనివాస్, గోపగాని నర్సింహ రాములు తదితరులు ఉన్నారు.
మీ శీలపాక రాజు, మన భారత్, జర్నలిస్టు, చిట్యాల
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
