e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

గ్రామీణ సమస్యలపై ట్రైనీ ఐఏఎస్ అధికారుల ఆరా..

దేవాపూర్‌లో గ్రామీణ సమస్యలపై ట్రైనీ ఐఏఎస్ అధికారుల ఆరా
రైతులు, ఉపాధి హామీ కూలీలు, డోక్రా మహిళలతో ముఖాముఖి
వ్యవసాయం, ఉపాధి, మహిళా సంఘాల సమస్యలపై వివరాల సేకరణ

మన భారత్, తలమడుగు:నవంబర్ 24,

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను గుర్తించే లక్ష్యంతో ట్రైనీ ఐఏఎస్ అధికారులు తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు, ఉపాధి హామీ కూలీలు, డోక్రా మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామ సందర్శనలో భాగంగా ముందుగా రైతులతో మాట్లాడిన అధికారులు వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలు, సాగు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరాలు సేకరించారు. వ్యవసాయ పనులకు సంబంధించిన అవసరాలు, గ్రామీణ రైతులకు అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు.

అనంతరం వీబీజీ (ఉపాధి హామీ) కూలీలతో సమావేశమై పనుల కల్పన, కూలీ చెల్లింపులు, పని ప్రదేశాల్లో ఎదురవుతున్న సమస్యలు, ఇతర ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు అందుతున్న ప్రయోజనాలు, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

డోక్రా మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడిన అధికారులు మహిళల జీవనోపాధి, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు, ఆర్థిక అవసరాలు, సంఘాల ద్వారా ఎదురవుతున్న సమస్యలపై వివరాలు సేకరించారు. మహిళలు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందేందుకు అవసరమైన అవకాశాలు, గ్రామీణ స్థాయిలో వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామీణ ప్రజల వాస్తవ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అవగాహన పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి అవసరమైన చర్యలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్, ఉపసర్పంచ్ మేకల శ్రీరామ్, ఎంపీఓ సుమీర్, ఎంపీడీఓ శంకర్, పంచాయతీ కార్యదర్శి రాందాస్, దాతాజీ కిరణ్, వార్డు సభ్యులు ఓస రవి, పోతుగంటి అశోక్, గోనె శ్రీనివాస్ యాదవ్, ఎంబడి రఘు, గంగాధర్, నాయిని పోచన్నతో పాటు గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE