వరుణదేవా… నువ్వైనా కనికరించవా!

Published on

-Advertisement-

అకాల వర్షాలతో రైతుల ఆవేదన

కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతున్న ధాన్యం

లారీలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు

మన భారత్, తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని నీ ఝరి గ్రామంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు రాత్రి వేళల్లో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయి. ఎంతో శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు ఇప్పుడు ప్రకృతి ప్రహారం, అధికారుల నిర్లక్ష్యం మధ్య నలిగిపోతున్నారు.

గత పది రోజులుగా మండల వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పగటి వేళల్లో తీవ్ర ఎండలు కాసే పరిస్థితి ఉండగా, రాత్రి సమయాల్లో ఒక్కసారిగా వర్షాలు కురుస్తుండటంతో కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన ధాన్యం తడిసి పోతోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

రైతులు తెల్లవారుజాము నుంచే కొనుగోలు కేంద్రాల వద్దకు చేరుకుని లారీల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే లారీలు సమయానికి అందుబాటులోకి రాకపోవడం, తూకాల ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల ధాన్యం రోజుల తరబడి కేంద్రాల వద్దే నిల్వ ఉండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం నాణ్యత దెబ్బతింటోందని చెబుతున్నారు.

తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు టార్పాలిన్లు కప్పుతూ రాత్రింబవళ్లు కేంద్రాల వద్దే గడుపుతున్నారు. కొందరు రైతులు కుటుంబ సభ్యులతో కలిసి ధాన్యాన్ని రక్షించుకునేందుకు నిద్ర లేకుండా కాపలా కాస్తున్నారు. “పంట బాగుంటే రైతు బాగుంటాడు” అని చెప్పే పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా రైతులు వర్షాల కోసం వరుణదేవుడిని ప్రార్థిస్తారు. కానీ ప్రస్తుతం మాత్రం “వరుణదేవా… కొద్దిరోజులు వర్షాలు ఆపండి” అంటూ రైతులు వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అకాల వర్షాలు రైతుల ఆశలను నీరుగార్చుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.

రైతులు పలుమార్లు సంబంధిత అధికారులకు సమస్యను వివరించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే అదనపు లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని త్వరితగతిన తరలించాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తడిసిన ధాన్యం కారణంగా భారీ నష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు అకాల వర్షాలు, లారీ సమస్యలు, కొనుగోలు జాప్యంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల్లో తగిన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సోయాబీన్ కాయల్లోనే మొలకలు.. రైతుల్లో ఆందోళన

  కోతకు ముందే గింజలు మొలకెత్తడంతో దిగుబడి, నాణ్యతపై ప్రభావం పంటను పరిశీలించి నష్టపరిహారం అందించాలని రైతుల విజ్ఞప్తి మన భారత్, సెప్టెంబర్...

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న మెరుగైన వైద్యం...

రిమ్స్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది..

మరో ఇద్దరు పసికందుల మృతి.. విషాదంలో కుటుంబాలు ఆసిఫాబాద్‌ లింగాపూర్‌, ఇంద్రవెల్లి దుబ్బగూడకు చెందిన శిశువులూ మృతి మన భారత్‌, సెప్టెంబర్‌...

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మాజీ సర్పంచ్ రవి నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే మన భారత్,...

More like this

సోయాబీన్ కాయల్లోనే మొలకలు.. రైతుల్లో ఆందోళన

  కోతకు ముందే గింజలు మొలకెత్తడంతో దిగుబడి, నాణ్యతపై ప్రభావం పంటను పరిశీలించి నష్టపరిహారం అందించాలని రైతుల విజ్ఞప్తి మన భారత్, సెప్టెంబర్...

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న మెరుగైన వైద్యం...

రిమ్స్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది..

మరో ఇద్దరు పసికందుల మృతి.. విషాదంలో కుటుంబాలు ఆసిఫాబాద్‌ లింగాపూర్‌, ఇంద్రవెల్లి దుబ్బగూడకు చెందిన శిశువులూ మృతి మన భారత్‌, సెప్టెంబర్‌...