e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల ఆర్థిక భరోసా -భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల ఆర్థిక భరోసా

-భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మొగుళ్ళపల్లి: నవంబర్ 22, (మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదికలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబం జీవిత బీమా అవగాహన కార్యక్రమాల్లో ఆదివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని గ్రామాల ప్రజలకు , పథకం ఉద్దేశం, ప్రయోజనం దరఖాస్తు చేసుకునే విధానం, ఆన్లైన్ నమోదు ప్రక్రియపై వివరించారు. మొగుళ్లపల్లి మండలంలోని చింతలపల్లి మేదరమెట్ల ,మొగుళ్లపల్లి , గుడిపహాడ్, ఎల్లారెడ్డిపల్లె, గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా రక్షణ కల్పించడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా తో ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల విజయ -రవీందర్ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎండి రఫీ, జిల్లా నాయకులు నడిగోటి రాము,తక్కల్లపల్లి రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు,వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE