ఇక ప్రపంచానికి కఠిన పరీక్ష..

Published on

-Advertisement-

న్యూఢిల్లీ, మన భారత్:

పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచాన్ని తీవ్ర వాతావరణ మార్పులు కుదిపే ‘సూపర్ ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది సాధారణ ఎల్ నినో కంటే మరింత ప్రభావవంతంగా ఉండి, 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

ఈ పరిణామం కారణంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్‌లో వర్షపాతం తగ్గి, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. రైతులకు ఇది భారీ సవాలుగా మారే అవకాశముంది.

ఇక దక్షిణ అమెరికా దేశాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉండగా, ఆసియా ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ వాతావరణ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

ఈ పరిస్థితులకు ముందుగానే సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నీటి నిర్వహణ, పంటల మార్పులు, వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అనుసరించడం అత్యవసరమని పేర్కొంటున్నారు. ప్రభుత్వాలు, రైతులు, ప్రజలు కలిసి ముందస్తు చర్యలు తీసుకుంటే నష్టాన్ని కొంతవరకు తగ్గించవచ్చని తెలిపారు.

రాజకీయ నాయకులకు శుభవార్త.!

https://manabharath.com/7179/

🔖 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

More like this