e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, November 28, 2026

మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు ఘన నివాళులు అర్పించాలి

మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు ఘన నివాళులు అర్పించాలి

శనివారం ఉదయం 7.15 గంటలకు ప్రత్యేక కార్యక్రమం.. మాలి మహాసంఘం, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే

ఆదిలాబాద్, మన భారత్:

సామాజిక సమానత్వం, విద్యా వికాసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మాలి మహాసంఘం, మాలి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే పిలుపునిచ్చారు. సమాజంలో విద్యా చైతన్యం పెంపొందించడంతో పాటు పూలే దంపతులు చూపిన సామాజిక మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర కమిటీ, మాలి ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు జిల్లా కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ కాంపౌండ్‌లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించేందుకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మాలి మహాసంఘం, మాలి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారతీయ మాలి మహాసంఘం మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ రాజేంద్ర మహాజన్ హాజరుకానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆయన సమక్షంలో పూలే దంపతుల సేవలను స్మరించుకుంటూ నివాళుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాలి సంఘం నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పూలే అభిమానులు, బీసీ సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశ సామాజిక చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్న మహనీయుడని, సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించి అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని సుకుమార్ పటేల్ పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా విద్యకు ప్రాధాన్యతనిస్తూ సావిత్రిబాయి పూలేతో కలిసి విద్యా ఉద్యమానికి పునాదులు వేశారని గుర్తుచేశారు. అణగారిన వర్గాలకు విద్య ద్వారా సామాజిక గౌరవం, సమాన అవకాశాలు కల్పించాలన్న ఆయన ఆలోచనలు నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు.

పూలే దంపతుల ఆశయాలను కేవలం జయంతి, వర్ధంతి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా వారి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. విద్య, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలపై యువతలో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన సాధనమని, ప్రతి కుటుంబంలో విద్యకు ప్రాధాన్యత పెరిగినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించనున్న నివాళుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాలి సంఘం నాయకులు, ఉద్యోగులు, పూలే అభిమానులకు పిలుపునిచ్చారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE