ఇక ప్రపంచానికి కఠిన పరీక్ష..
న్యూఢిల్లీ, మన భారత్: పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచాన్ని తీవ్ర వాతావరణ మార్పులు కుదిపే ‘సూపర్ ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది సాధారణ ఎల్ నినో కంటే మరింత ప్రభావవంతంగా ఉండి, 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం కారణంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్లో వర్షపాతం తగ్గి,...