e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి: సిఐటియు

మన భారత్, నాగర్ కర్నూల్:

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ దేశ కార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే విధంగా ఉన్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) నేతలు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రూపొందించిన ఈ లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను బలహీనపరిచే విధంగా ఉన్నాయని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్స్‌ను తీసుకురావడం కార్మిక ఉద్యమాలపై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని సూచిస్తోందని ఆయన మండిపడ్డారు.

దేశ కార్మిక వర్గం ఎన్నో సంవత్సరాల పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించిన హక్కులను ఈ కొత్త కోడ్స్ ద్వారా నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఈ చట్టాల అమలుపై కార్మికుల ఆందోళనల కారణంగా కేంద్రం వెనుకడుగు వేస్తూ వచ్చినప్పటికీ, ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించడం ఆందోళనకరమని అన్నారు.

ఆర్థిక వృద్ధి పేరుతో సంపద పంపిణీని విస్మరిస్తే నిరుద్యోగం పెరుగుతుందని, దీనివల్ల కార్పొరేట్లు శ్రమశక్తిని దోపిడీ చేసే అవకాశాలు పెరుగుతాయని ఆయన హెచ్చరించారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వకుండా మూడు నుంచి నాలుగు నెలల వరకు పెండింగ్‌లో ఉంచుతున్నారని, ఉద్యోగ భద్రత కల్పించడంలో విఫలమవుతున్నారని అన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే “చలో అసెంబ్లీ” వంటి కార్యక్రమాలను అడ్డుకుంటూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అంతర్జాతీయ పరిస్థితులపై స్పందిస్తూ, అమెరికా-ఇజ్రాయిల్ చర్యల వల్ల ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత పెరిగి, దాని ప్రభావం భారత్‌పై పడుతోందని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు వర్ధన్ పర్వతాలు, సహాయ కార్యదర్శి పొదిల రామయ్య, శంకర్ నాయక్, శివ వర్మ, దశరథం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE