e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

సర్పంచ్ పదవి కోసమే పెళ్లి.. చివరికి నిరాశే.!

సర్పంచ్ పదవి కోసమే పెళ్లి… చివరికి నిరాశే!

మన భారత్ – తెలంగాణ డెస్క్, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో జరిగిన ఓ విచిత్ర ఘటన నెటిజన్లలో నవ్వులు పూయించింది. సర్పంచ్ కావాలనే కోరికతో హుటాహుటిన పెళ్లి చేసుకున్న వ్యక్తి చివరికి బోల్తా పడ్డారు. కరీంనగర్ జిల్లా నాగిరెడ్డిపూర్ గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళలకు రిజర్వ్ కావడంతో, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ముచ్చె శంకర్ వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.

శంకర్, నల్గొండ జిల్లాకు చెందిన ఓ మహిళను శీఘ్రంగా వివాహం చేసుకుని, భార్యను అభ్యర్థిగా నిలబెట్టాలనే ప్లాన్ వేసుకున్నారు. అయితే ఈ తొందరపాటు పెళ్లి ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా వచ్చిన నోటిఫికేషన్‌కు ముందు ఓటర్‌గా నమోదు చేసుకోవడంలో ఆలస్యమైపోవడంతో వారి ప్రణాళిక పూర్తిగా విఫలమైంది.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోల్స్‌ను తెచ్చుకుంది. ‘పదవి కోసం పెళ్లి’ చేసిన ప్లాన్ ఫలించకపోవడం నెటిజన్లకైతే వినోదంగా మారింది. శంకర్‌కు మాత్రం నిరాశే మిగిలింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE