అగ్ని ప్రమాదం.. 50 క్వింటాళ్ల పత్తి బూడిద 

Published on

-Advertisement-

జైనథ్‌లో అగ్ని ప్రమాదం.. 50 క్వింటాళ్ల పత్తి బూడిద 

లక్ష్మీపూర్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు – రైతుకు తీవ్ర నష్టం

మన భారత్, జైనథ్, నవంబర్ 10: జైనథ్ మండలంలో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ స్టేషన్ అధికారుల సమాచారం ప్రకారం, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు ఎడవ్ దీపక్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే అగ్ని ప్రమాదం తీవ్రరూపం దాల్చి పరిసర ప్రాంతాలను ఆందోళనకు గురి చేసింది.

మంటలను ఆర్పేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో చివరకు మంటలను నియంత్రించారు. ఈ ఘటనలో దాదాపు 50 క్వింటాళ్ల పత్తి పూర్తిగా దగ్ధమై బూడిద అయిందని అధికారులు తెలిపారు.

పత్తి సీజన్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో రైతు దీపక్ కు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని గ్రామస్థులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ల వల్ల ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు.

Latest articles

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...

రూ.7 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి పూజ..

మన భారత్, తాంసి: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో సీసీ కల్వర్టు నిర్మాణానికి...

More like this