e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

శ్రీవారు శివాలయాన్ని దర్శించుకున్న ట్రైనీ ఐఏఎస్ అధికారులు

బరంపూర్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, నందిగామ శివాలయాన్ని దర్శించుకున్న ట్రైనీ ఐఏఎస్ అధికారులు

ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. ట్రైనీ అధికారులకు ఘన సన్మానం

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను ట్రైనీ ఐఏఎస్ అధికారులు సందర్శించారు. మండలంలోని బరంపూర్ గ్రామంలో కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు నందిగామ గ్రామంలోని పురాతన శివాలయాన్ని బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా ఆలయాల పూజారులు ట్రైనీ ఐఏఎస్ అధికారులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారికి, శివుడికి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం అధికారులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయాల విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ఈ సందర్భంగా వివరించారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కలిసి ట్రైనీ ఐఏఎస్ అధికారులను ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలను సందర్శించిన అధికారులకు శాలువాలతో సత్కరించి తమ అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

ఈ కార్యక్రమంలో దేవాపూర్ గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్, పంచాయతీ కార్యదర్శి రాందాస్, దాతాజీ కిరణ్, పోతుగంటి అశోక్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE