హైదరాబాద్‌లో అలర్ట్..! దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు

Published on

-Advertisement-

ఢిల్లీ పేలుడు ఘటన అనంతరం భద్రతా దళాల హైఅలర్ట్ – స్టేషన్లు, బస్టాండ్లలో కఠిన చెకింగ్‌లు

మన భారత్, హైదరాబాద్: ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు ప్రారంభించారు. నగరంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, ప్రజా రద్దీ ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్ఫ్‌పీ (RPF) సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందాలు అనుమానాస్పద లగేజీలు, వాహనాలు, వ్యక్తులపై కఠినంగా తనిఖీలు చేపట్టాయి. రైల్వే ప్లాట్‌ఫారంలు, వేయిటింగ్ హాల్స్, పార్కింగ్ ఏరియాల వద్ద భద్రతా చర్యలు మరింత బలోపేతం చేశారు.

ఇక, సీఐఎస్‌ఎఫ్ (CISF) దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, పారిశ్రామిక ప్రాజెక్టులు, రక్షణ స్థావరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this