e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

నిపాని పాఠశాలలో గణిత బోధనపై గ్రామస్తుల ఆందోళన.. హెడ్‌మాస్టర్‌ను కొనసాగించాలని ఎంఈఓకు వినతి

నిపాని పాఠశాలలో గణిత బోధనపై గ్రామస్తుల ఆందోళన.. హెడ్‌మాస్టర్‌ను కొనసాగించాలని ఎంఈఓకు వినతి

మన భారత్, భీంపూర్:నవంబర్ 20,

భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గణిత బోధనపై గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఇతర పరిపాలనా బాధ్యతలు, పాఠశాల పనులు అధికంగా ఉండటంతో విద్యార్థులకు గణిత సబ్జెక్టును సమర్థవంతంగా బోధించలేకపోతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు గణితంలో ఆశించిన స్థాయిలో పట్టు సాధించలేక చదువులో వెనుకబడే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని నిపాని గ్రామానికి చెందిన గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి శనివారం మండల విద్యాధికారి (ఎంఈఓ)ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అటంపవర్ సార్‌ను ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగించాలని వారు కోరారు.

విద్యార్థులకు గణితంపై పటిష్టమైన అవగాహన కల్పించడంతో పాటు, బోధనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంఈఓను విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గ్రామస్తుల అభ్యర్థనను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లెల స్వామి, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE