e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

ఇందిరమ్మ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేద కుటుంబాలకు కొండంత అండ

రూ.5 లక్షల బీమా పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి

మన భారత్ న్యూస్ చిట్యాల గుంటూరుపల్లి, నవంబర్ 20: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియలో భాగంగా శుక్రవారం గుంటూరుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ చైర్మన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి నమోదు ప్రక్రియను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబాన్ని పోషించే వ్యక్తికి అనుకోని ఆపద ఎదురైతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల అర్హులైన ప్రతి ఒక్కరూ ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తు చేసుకుని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.గ్రామ సర్పంచ్ గుంటుపల్లి నాగమల్లేశ్వర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ వివరాలను నమోదు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముద్ధన నాగరాజు, మాజీ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్, వార్డు సభ్యులు కంకణాల శ్రీనివాస్, పాశం లత, మక్కెన వినోద, శ్రీలత, గ్రామ పెద్దలు నర్రా శివ రామకృష్ణ, కంచెటి శోభ, మన్నెం తిరుపతి, కంకణాల రామకోటేశ్వర్ రావు, కోటపాటి శ్రీను, పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE