e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

అనారోగ్యంతో బాధపడుతున్న అశోక్ రావుకు వసుధ ఫౌండేషన్ ఆర్థిక సాయం

అనారోగ్యంతో బాధపడుతున్న అశోక్ రావుకు వసుధ ఫౌండేషన్ ఆర్థిక సాయం

వైద్య ఖర్చుల నిమిత్తం రూ.7 వేల అందజేత

మన భారత్, తలమడుగు: నవంబర్ 20, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తలమడుగు గ్రామానికి చెందిన పునుగొంటి అశోక్ రావుకు వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.7,000 ఆర్థిక సహాయం అందించారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఈ మొత్తాన్ని అందజేసి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చంటి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ అనిరుద్, వార్డు సభ్యుడు మహేందర్ తదితరులు కలిసి అశోక్ రావుకు రూ.7 వేల నగదు అందజేశారు.

అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆపద సమయంలో ఆర్థిక సహాయం అందించడం ద్వారా కొంత ఊరట కల్పించవచ్చని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా వసుధ ఫౌండేషన్ అందిస్తున్న సహకారం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE