e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతనుతనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా: దాతజీ కిరణ్

తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా: దాతజీ కిరణ్

పార్టీ బలోపేతానికి, యువత ఐక్యతకు కృషి చేస్తా.. నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బీజేవైఎం మండల అధ్యక్షుడు

మన భారత్, తలమడుగు: నవంబర్ 17, భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తలమడుగు మండల అధ్యక్షుడిగా తనకు బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి దాతజీ కిరణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై మరోసారి నమ్మకం ఉంచి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ పదవిని కేవలం హోదాగా కాకుండా ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, క్రమశిక్షణకు కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. మండలంలోని యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి భారతీయ జనతా యువ మోర్చాను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో, కార్యకర్తల సహకారంతో తలమడుగు మండలంలో పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు యువతకు పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత కల్పించేలా పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.

తనకు ఈ బాధ్యత అప్పగించడంలో కీలకంగా వ్యవహరించిన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు కాళ్ల సాయికృష్ణతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

“మీరు నాపై ఉంచిన నమ్మకమే నా బలం.. మీరు అప్పగించిన బాధ్యతే నా కర్తవ్యం.. ప్రజాసేవే నా లక్ష్యం” అని దాతజీ కిరణ్ పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి, యువత ఐక్యత, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE