e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

భక్తిశ్రద్ధలతో తాలూకా మున్నూరుకాపు సంఘం కార్తీక మాస వనభోజనాలు

భక్తిశ్రద్ధలతో తాలూకా మున్నూరుకాపు సంఘం కార్తీక మాస వనభోజనాలు
ప్రత్యేక పూజలు నిర్వహించి, సామూహికంగా వనభోజనాలు చేసిన మహిళలు

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 17,

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ తాలూకా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్తీక మాసం ప్రాముఖ్యతను చాటిచెప్పేలా ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని, ప్రకృతి ఒడిలో సామూహికంగా వనభోజనాలు చేశారు. మహిళలు సంప్రదాయబద్ధంగా కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేశారు.

ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. కార్తీక మాసంలో వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు సంఘ సభ్యుల మధ్య ఐక్యత, సోదరభావం, పరస్పర పరిచయాలను బలోపేతం చేస్తాయని తెలిపారు. కుటుంబ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్న, తాలూకా మున్నూరుకాపు సంఘం సభ్యులు, మహిళలు, సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE