e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

టీఎస్‌యూటీఎఫ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

తలమడుగు మండల టీఎస్‌యూటీఎఫ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

మండల అధ్యక్షుడిగా కే. శంకర్, ప్రధాన కార్యదర్శిగా కే. గంగాధర్ ఎంపిక

మన భారత్, తలమడుగు:నవంబర్ 12,

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) తలమడుగు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో తలమడుగు మండల మహాసభలను నిర్వహించారు.

ఈ మహాసభల్లో ఉపాధ్యాయ సంఘం భవిష్యత్ కార్యాచరణ, ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ అభివృద్ధి, సంఘం బలోపేతం వంటి అంశాలపై చర్చించిన అనంతరం నూతన మండల కమిటీ ఎన్నిక చేపట్టారు. ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా కే. శంకర్, మండల ప్రధాన కార్యదర్శిగా కే. గంగాధర్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కమిటీ ఎన్నికతో తలమడుగు మండలంలో ఉపాధ్యాయ సంఘం కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, విద్యారంగ అభివృద్ధి కోసం సంఘం తరఫున కృషి చేయాలని మహాసభలో చర్చించినట్లు తెలిసింది.

నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కే. శంకర్, ప్రధాన కార్యదర్శి కే. గంగాధర్‌లకు ఉపాధ్యాయ సంఘం సభ్యులు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE