e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

మొగుళ్ళపల్లి, నవంబర్ 11, (మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామ సర్పంచ్ జోరుక సదయ్య తల్లి జోరుక లక్ష్మి ఇటీవల మృతి చెందడంతో, బుధవారం మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అదేవిధంగా, ఇదే మండలంలోని కొరికిశాల గ్రామ మాజీ సర్పంచ్ దానబోయిన రాములు కుమారుడు జైశ్వంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న వినోద్ కుమార్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబాల సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతి రావు, పార్టీ సీనియర్ నాయకులు శోభన్, రఘు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE