e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఇనుప రేకులతో ప్రమాదాలకు జరిగే అవకాశం..

గ్రామ ప్రవేశంలో ప్రమాదకరంగా మారిన ఇనుప రేకులు.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికుల ఆందోళన

మన భారత్, బోథ్:నవంబర్ 11,

బోథ్ మండలంలోని కూచులాపూర్ గ్రామ ప్రవేశ మార్గంలో ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆనుకుని ఉన్న ఇనుప రేకులు ప్రమాదకరంగా మారడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపైకి వచ్చే విధంగా ఇనుప రేకులు ఉండటంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

గ్రామంలోకి ప్రవేశించే ప్రధాన మార్గం వద్దే ఈ పరిస్థితి ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇనుప రేకులు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక సర్పంచ్ మైలీ నారాయణకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకుండా, ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

ప్రాణనష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలి

గ్రామ ప్రవేశంలో ప్రమాదకరంగా ఉన్న ఇనుప రేకులను వెంటనే తొలగించడం లేదా సురక్షితంగా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE