e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఆదివాసీ సంస్కృతి, సపూర్వీకుల వారసత్వాన్ని భావితరాలకు అందించాలి: ఎమ్మెల్యే

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు దండారి ఉత్సవాలు ప్రతీకలు
పూర్వీకుల వారసత్వాన్ని భావితరాలకు అందించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్

మన భారత్, సాత్నాల:నవంబర్ 7,

ఆదివాసీల ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, ఐకమత్యానికి దండారి ఉత్సవాలు ప్రతీకలుగా నిలుస్తాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సాత్నాల మండలంలోని జంబుల్దరి గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ఆదివాసీలతో కలిసి వేడుకలను తిలకించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దీపావళి పండుగకు ముందు ఆదివాసీలు తరతరాలుగా నిర్వహిస్తున్న దండారి ఉత్సవాలు, గుస్సాడీ నృత్యాలు మన పూర్వీకులు అందించిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వమని పేర్కొన్నారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి పరస్పరం ప్రేమానురాగాలు, ఆప్యాయతలు పంచుకుంటూ ఐకమత్యంతో పండుగను జరుపుకోవడం ఈ ఉత్సవాల ప్రత్యేకత అని వివరించారు.

ఆదివాసీల సంప్రదాయ నృత్యాలు, ఆచార వ్యవహారాలు, పండుగలకు దేశవిదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని, వాటిపై పరిశోధనలు సైతం జరుగుతున్నాయని తెలిపారు. ఆధునిక కాలంలోనూ తమ మూలాలను మరచిపోకుండా సంప్రదాయాలను కొనసాగించడం అభినందనీయమన్నారు. ఆదివాసీ సంస్కృతి, కళలు, ఆచారాలను భావితరాలకు పరిచయం చేసి, వాటి ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

దండారి ఉత్సవాలు కేవలం నృత్యాలు, వినోద కార్యక్రమాలకే పరిమితం కావని, మనుషుల మధ్య ప్రేమ, సోదరభావం, ఐకమత్యాన్ని పెంపొందించే గొప్ప సందేశాన్ని అందిస్తాయని పాయల్ శంకర్ పేర్కొన్నారు. రోజువారీ జీవితంలోని బాధలను మరచి, అందరినీ ఆత్మీయులుగా భావిస్తూ సంతోషంగా జీవించాలనే జీవన సందేశం ఈ ఉత్సవాల్లో అంతర్లీనంగా ఉందన్నారు.

ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆదివాసీ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య, అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. పూర్వీకులు అందించిన గొప్ప సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ఉత్సాహంగా కొనసాగించాలని, పరస్పర సహకారం, ఐకమత్యంతో సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

జంబుల్దరి గ్రామంలో జరిగిన దండారి ఉత్సవాలు ఆదివాసీ కళలు, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE