e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

శ్రీ సాయి ఐ కేర్ ఉచిత కంటి వైద్య శిబిరం..

శ్రీ సాయి ఐ కేర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత మందులు, అద్దాలు.. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు

మన భారత్, తలమడుగు: నవంబర్ 6, గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో శ్రీ సాయి ఐ కేర్ (SRI SAI EYE CARE) ఆధ్వర్యంలో పల్లికె గ్రామంలో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.

ఈ శిబిరంలో వైద్య సిబ్బంది గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలను గుర్తించారు. కంటి సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు అందించనున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. అవసరమైన వారికి కంటి అద్దాలు అందుబాటు ధరల్లో లభిస్తాయని పేర్కొన్నారు.

అదేవిధంగా కంటి ఆపరేషన్ అవసరమైన వారిని గుర్తించి, అర్హులైన పేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు వెల్లడించారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది గ్రామస్తులకు సూచించారు.

కంటి వైద్య సేవలు అవసరమైన వారు ఆదిలాబాద్‌లోని క్రాంతినగర్, లింగారెడ్డి హాస్పిటల్ సమీపంలో ఉన్న శ్రీ సాయి ఐ కేర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుమ్మాల లక్ష్మి అశోక్, శ్రీ సాయి ఐ కేర్ వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE