e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

మాల సంఘ భవన నిర్మాణానికి ఎంపీ నిధులు..

బండలింగంపల్లికి రూ.3 లక్షలు కేటాయించిన ఎంపీ బండి సంజయ్ కుమార్.

రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 5 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో మాల సంఘ భవన నిర్మాణానికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షలు కేటాయించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మాల సంఘ భవన నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు కావడం సంతోషకరమన్నారు. ఈ నిధులతో భవన నిర్మాణ పనులకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు మాల సంఘం సభ్యులు, గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నిధుల మంజూరుతో సంఘ సభ్యుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షుడు బాలగౌడ్, మెడుసు శ్రీనివాస్ రెడ్డి, చింతల లహరి, మాచర్ల హరికృష్ణ, చీకట్ల ప్రవీణ్, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE