e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

భర్తతో చిన్న గొడవ.. 15 నెలల కుమారుడితో మహిళ అదృశ్యం.

గోరంటాలలో ఘటన.. గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.

రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 5 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర :
భర్తతో చిన్నపాటి గొడవ పడిన ఓ మహిళ తన 15 నెలల కుమారుడితో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరంటాల గ్రామంలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. గోరంటాల గ్రామానికి చెందిన బందెల నవిత (29) నవంబర్ 4వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో భర్త ప్రశాంత్‌తో చిన్నపాటి గొడవ అనంతరం తన 15 నెలల కుమారుడు హిమన్షుతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.దీంతో భర్త ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంభీరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.

మహిళ బందెల నవిత, ఆమె కుమారుడు హిమన్షు ఆచూకీ తెలిసిన వారు గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను లేదా సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గాలు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE