e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఉన్నతి విద్యతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు

ఉన్నతి విద్యతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం – జిల్లా కలెక్టర్ రాజర్షి షా

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 5,

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయడమే ‘ఉన్నతి విద్య’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇలాంటి విద్యా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మసూద్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలక్‌మందిర్) పీఎం శ్రీ పాఠశాలలో నిర్వహించిన ‘ఉన్నతి విద్య’ కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘ఉన్నతికి బాట.. విద్యతో ప్రయాణం – అభ్యసనం, అభివృద్ధి, విజయం’ అనే నినాదంతో రూపొందించిన ఈ కార్యక్రమం విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు బలమైన విద్యా పునాది కల్పిస్తే భవిష్యత్తులో వారు ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరని అభిప్రాయపడ్డారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా విధానాల్లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల్లో పుస్తక జ్ఞానంతో పాటు ఆలోచనా శక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ వంటి లక్షణాలను పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదువుతూ తమకు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్

కార్యక్రమం అనంతరం కలెక్టర్ పాఠశాలలోని వివిధ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. పాఠ్యాంశాలకు సంబంధించి ప్రశ్నలు అడిగి వారి అభ్యసన స్థాయిని, విషయ పరిజ్ఞానాన్ని పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సందేహాలను నివృత్తి చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు.

అలాగే పాఠశాలలో అమలవుతున్న బోధనా విధానాలు, విద్యార్థులకు అందుతున్న విద్యా సదుపాయాలు, తరగతి గదుల్లో అందుబాటులో ఉన్న వసతుల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి, సెక్టోరల్ అధికారులు లక్ష్మణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE