e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

కేటీఆర్‌ను కలిసిన యువ నాయకుడు పిడుగు అభిరాం రెడ్డి

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన యువ నాయకుడు పిడుగు అభిరాం రెడ్డి

రైతులకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపిన అభిరాం రెడ్డి – తలమడుగు పర్యటన విజయవంతం కావడంపై కేటీఆర్ అభినందనలు

మన భారత్, తలమడుగు:నవంబర్ 5, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను యువ నాయకుడు పిడుగు అభిరాం రెడ్డి హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో ఈ భేటీ జరిగినట్లు సమాచారం.

ఇటీవల కేటీఆర్ తలమడుగు మండలంలో పర్యటించిన సందర్భంగా రైతు కుటుంబాలకు అండగా నిలిచి వారికి భరోసా కల్పించినందుకు అభిరాం రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలపై స్పందిస్తూ వారికి మద్దతుగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తలమడుగు మండల పర్యటనను విజయవంతం చేయడంలో చురుకుగా వ్యవహరించిన యువ నాయకుడు పిడుగు అభిరాం రెడ్డిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం, ప్రజా సమస్యలపై స్పందించే నాయకత్వం కీలకమని ఈ భేటీ ద్వారా మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది.

కేటీఆర్‌తో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీ స్థానిక బీఆర్ఎస్ యువ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపిందనారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కెమా శ్రీకాంత్, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE