e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

బీఆర్ఎస్‌కు భారీ బలం.. కాంగ్రెస్ బీజేపీ నుంచి 50 మంది చేరిక

ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్‌కు భారీ బలం.. కాంగ్రెస్, బీజేపీ నుంచి 50 మంది చేరిక

కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న పలువురు ముఖ్య నాయకులు, యువజన నేతలు

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 4,

ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, యువజన నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు కలిపి సుమారు 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా నాయకుడు జోగు రామన్న నాయకత్వానికి మద్దతు ప్రకటిస్తూ ఈ చేరికలు జరిగినట్లు నాయకులు తెలిపారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే బీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు జిల్లాలోని పలువురు ఇతర పార్టీల నాయకులు కూడా బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో తాజా చేరికలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

పార్టీలో చేరిన వారిలో పీఏసీఎస్ డైరెక్టర్ భూతం శ్రీనివాస్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ రావు, ఏఎంసీ డైరెక్టర్ నవీన్ రెడ్డి, టౌన్ యూత్ ప్రెసిడెంట్ బండి నరసింహాచారి, బేల మండల మాజీ అధ్యక్షుడు దినేష్ గౌడ్, టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రజినీ రెడ్డి, బీజేపీ జనరల్ సెక్రటరీ రాసం రాజు, పద్మశాలి సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ విట్టల్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు సుమారు 50 మంది యువజన నాయకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు బీఆర్ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వంలో జిల్లాలో గతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని పేర్కొంటూ, ఆయన నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు వెల్లడించారు.

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జోగు రామన్న నిరంతరం పోరాటాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. రైతుల సమస్యలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేస్తున్న పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, బీఆర్ఎస్ పార్టీ విధానాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత విస్తరించి, గులాబీ జెండాను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని నూతనంగా చేరిన నాయకులు వెల్లడించారు.

ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు బీఆర్ఎస్‌లో చేరడం ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE