e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చడమే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక కార్యాచరణ
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చడమే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 4,

ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా విద్యా ప్రమాణాల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

బుధవారం జిల్లా కేంద్రంలో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యా ప్రమాణాల అభివృద్ధి, విద్యార్థుల అభ్యసన స్థాయిలు, పాఠశాలల్లో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు వంటి కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధన అందించాలని తెలిపారు.

సంకల్ప్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ప్రతి విద్యార్థిలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడం, విద్యా ప్రమాణాల్లో వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమేనని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన మార్పులు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి, విద్యాశాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE