e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

సర్పంచ్ ఈరగొల్ల అశోక్ ను అభినందించిన ట్రైనీ అధికారులు అధికారులు

పుట్టినరోజులు, పెళ్లిరోజులకు మొక్కలు నాటే ఆలోచన అభినందనీయం
జామిడి గ్రామంలో ట్రైనీ ఐఏఎస్ అధికారులతో కొబ్బరి మొక్కలు నాటించిన సర్పంచ్ ఈరగొల్ల అశోక్

మన భారత్, తాంసి:నవంబర్ 4,

ఆకుపచ్చని గ్రామాల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ చేపడుతున్న మొక్కల నాటే కార్యక్రమాన్ని ట్రైనీ ఐఏఎస్ అధికారులు అభినందించారు. గ్రామ పర్యటనలో భాగంగా పర్యావరణ హిత కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, పాఠశాల ప్రాంగణంలో కొబ్బరి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్ అధికారులు గ్రామంలో పర్యటించి పశుసంపద, పశుపోషణ పరిస్థితులపై పశువైద్యాధికారి శ్రీకాంత్‌తో కలిసి రైతులతో నేరుగా మాట్లాడారు. పశువుల పెంపకం, వాటి సంరక్షణ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పశుసంవర్ధక శాఖ ద్వారా అందుతున్న సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులతో ముచ్చటిస్తూ పశుపోషణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

గ్రామంలో ఎవరైనా పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకున్న సందర్భంలో రెండు పండ్ల మొక్కలు నాటాలనే ఆలోచనను సర్పంచ్ ఈరగొల్ల అశోక్ అధికారులకు వివరించారు. వ్యక్తిగత వేడుకలను పర్యావరణ పరిరక్షణతో అనుసంధానం చేయడం ద్వారా గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ఆలోచనను ట్రైనీ ఐఏఎస్ అధికారులు అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

అనంతరం పాఠశాల ప్రధాన ద్వారం ఎదుట ట్రైనీ ఐఏఎస్ అధికారులతో కలిసి రెండు కొబ్బరి మొక్కలను నాటించారు. మొక్కల సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గణేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, పశువైద్యాధికారి శ్రీకాంత్, నాయకులు వినోద్ రెడ్డి, ఆనంద్, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE