e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

ఢిల్లీలో ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు విక్రాంత్ బూరియాతో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల భేటీ

ఢిల్లీలో ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు విక్రాంత్ బూరియాతో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల భేటీ

జిల్లాలో పార్టీ బలోపేతం, గిరిజన ప్రాంతాల్లో భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘ చర్చ

మన భారత్, ఆదిలాబాద్:, అక్టోబర్ 31‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు విక్రాంత్ బూరియాను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.

ఈ సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై విక్రాంత్ బూరియాతో నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా జిల్లాలోని ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆదివాసీల అభివృద్ధి, వారి హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని నాయకులు ప్రస్తావించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు చేరువయ్యేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించాలని అభిప్రాయపడ్డారు.

ఆదివాసీలు, గిరిజనుల సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని, వారి హక్కుల పరిరక్షణలో పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో జాతీయ స్థాయి నాయకులతో జరిగిన ఈ భేటీ జిల్లా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు దోహదపడుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE