e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి నివాళి అర్పించిన చిట్యాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దబ్బెట అనిల్*

మన భారత్ చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా అక్టోబర్ 31: చిట్యాల మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ దివంగత ఇందిరాగాంధీ గారి 42 వర్ధంతి సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దబ్బెట అనిల్ మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత, అభివృద్ధి కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. పేదల సంక్షేమం కోసం బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచనం వంటి సాహసోపేత నిర్ణయాలతో దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారని కొనియాడారు. ఆమె ఆశయాలను కొనసాగించడమే మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.

ఇందిరాగాంధీ చూపిన ధైర్యం, నాయకత్వ లక్షణాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఆమె బాటలోనే పయనిస్తుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, జిల్లా నాయకులు చిలుకల రాయకోమురు బుర్ర శ్రీనివాస్ గౌడ్ బుర్ర లక్ష్మణ్ గౌడ్ మాజీ ఎంపీటీసీ గుర్రపు సునీత తిరుపతి కట్కూరి పద్మ నరేందర్ ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు ముద్దన నాగరాజు వార్డు సభ్యులు శనిగరపు మొగిలి తీగల నాగరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంపెళ్ళి కిషన్ కొర్రి మైసయ్య పింగళి సతీష్ రెడ్డి చిలుముల రాజమొగిలి బుర్ర మల్లేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు మోత్కూరి సాయి కృష్ణ సర్వ శరత్ కుమార్ పన్నాల శశి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE