e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

ఢిల్లీలో ఇందిరా గాంధీకి ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల ఘన నివాళి..

ఢిల్లీలో ఇందిరా గాంధీకి ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల ఘన నివాళి

దేశం కోసం ఆమె చేసిన త్యాగాలు, పేదల సంక్షేమానికి చేపట్టిన సంస్కరణలు చిరస్మరణీయం

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ ‘31,చలో ఢిల్లీ’ కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధి కోసం ఇందిరా గాంధీ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. దేశం కోసం ఆమె చేసిన త్యాగాలు, ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాలు నేటి తరానికి సైతం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

భారత రాజకీయ చరిత్రలో ఇందిరా గాంధీకి ప్రత్యేక స్థానం ఉందని, ధైర్యం, దృఢ సంకల్పంతో దేశ పాలనలో కీలక నిర్ణయాలు తీసుకున్న నాయకురాలిగా ఆమె సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఆమె ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పనిచేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇందిరా గాంధీకి నివాళులర్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE