e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

క్రీడాకారులకు ప్రోత్సాహం.. విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట

సుల్తానాబాద్‌లో అండర్‌-17 జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

రూ.8 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్.. రూ.3 కోట్లతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన: ప్రభుత్వ విప్ విజయరమణారావు

సుల్తానాబాద్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, విద్యారంగ అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ (SGF) కరీంనగర్ జిల్లా స్థాయి అండర్‌-17 బాలబాలికల వాలీబాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా మైదానంలో టాస్ వేసి పోటీలకు శ్రీకారం చుట్టారు. అనంతరం క్రీడాకారులు ప్రదర్శించిన ఆటతీరును ఆసక్తిగా తిలకించి వారిని అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభకు కొదవలేదని, సరైన ప్రోత్సాహం, శిక్షణ, అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

సుల్తానాబాద్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు

అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సుమారు రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న హైస్కూల్ భవన తరగతి గదుల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి విజయరమణారావు పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సుల్తానాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం సుమారు రూ.8 కోట్ల నిధులు మంజూరైనట్లు పేర్కొంటూ, పాఠశాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అందుబాటులోకి వస్తే పట్టణంతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే సుల్తానాబాద్ పట్టణంలోని వివిధ ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర అవసరాల కోసం సుమారు రూ.3 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని విజయరమణరావు పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మెరుగైన ప్రమాణాలు, ఆధునిక సదుపాయాలతో ప్రతి నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.

విద్య, క్రీడలు రెండూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలకమని, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంతో పాటు క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడం ద్వారా యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడా నిర్వాహకులు, కోచ్‌లు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE