e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణలో రైతులకు ఎకరాకు రూ.6 కోట్లు పరిహారం ఇవ్వాలి..కష్టాల అరుణ్ కుమార్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణలో రైతులకు ఎకరాకు రూ.6 కోట్లు పరిహారం ఇవ్వాలి

బోధన్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి రైతుల తరఫున వినతి పత్రం అందజేత

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 21, ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ అంశంపై రైతులకు న్యాయం చేయాలని కోరుతూ రైతుల తరఫున కాంగ్రెస్ నాయకులు, రైతులు శనివారం ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కలిసి భూసేకరణ వల్ల భూములు కోల్పోయే రైతులకు తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

విమానాశ్రయ నిర్మాణం కోసం భూములు సేకరించే పక్షంలో రైతులకు ఎకరాకు రూ.6 కోట్ల చొప్పున పరిహారం చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని వినతి పత్రంలో ప్రధానంగా కోరారు. భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించడంతో పాటు వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్లగా, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం రైతుల పక్షాన స్పందించి వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరినట్లు తెలిపారు. రైతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తమకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులకు రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి ప్రక్రియలో రైతుల ప్రయోజనాలను విస్మరించకుండా, భూములు కోల్పోయే ప్రతి రైతుకు న్యాయమైన పరిహారం అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని రైతులు కోరారు.

ఈ కార్యక్రమంలో కష్టాల అరుణ్ కుమార్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE