e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, October 27, 2026

సంక్షేమ ఫలితాలు అభివృద్ధి ద్వేయం… కాంగ్రెస్ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య

చిట్యాల మండల అభివృద్ధికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కృషి

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం: కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మన భారత్ ప్రతినిధి, శీలపాక రాజు:

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ద్వారా వివిధ వర్గాలకు ప్రయోజనం కల్పిస్తోందని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత, వడ్డీలేని రుణాలు, మహిళా సంఘాల ద్వారా బస్సుల కొనుగోలు, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రోత్సాహం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు.

చిట్యాల మండలంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత

భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కృషి చేస్తున్నారని దొడ్డి కిష్టయ్య అన్నారు. చిట్యాల మండలంలో గ్రామీణ రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, విద్యాసంస్థల మౌలిక సదుపాయాలు, దేవాలయాల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన ఇతర సౌకర్యాల కల్పనకు నిధులు మంజూరు చేయించారని వివరించారు.

ఈజీఎస్‌ పథకం కింద సుమారు రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి జరిగిందని, తండా–వెంచరామి రహదారి పనులకు రూ.6 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మండలానికి 400 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఒడితల, చల్లగరిగ, నైన్‌పాక గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు, నేరేడుపల్లి వంతెన పునర్నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరు చేయించారని చెప్పారు. ఈ వంతెనతో ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యం కలుగుతుందని వివరించారు.

నైన్‌పాక దేవాలయ అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కస్తూర్బా పాఠశాల, మోడల్ స్కూల్, వెలుగు ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, భవనాల పునర్నిర్మాణం కోసం ఒక్కో పాఠశాలకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈ పనులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన

చిట్యాల, చల్లగరిగ ప్రాంతాల్లో వాకర్స్‌, క్రీడాకారుల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు మహిళా సంఘాల భవనాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

చిట్యాల మండల కేంద్రంలో చిట్యాల–అంకుషాపూర్ వాగు ఒడ్డు వరకు స్మశానవాటిక రహదారి నిర్మాణానికి రూ.70 లక్షలు మంజూరు చేయించడం ద్వారా స్థానిక ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు ఎమ్మెల్యే కృషి చేశారని తెలిపారు.

పార్టీలకతీతంగా ప్రజాసేవే లక్ష్యం

కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని దొడ్డి కిష్టయ్య అన్నారు. చిట్యాల మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తారని తెలిపారు. భవిష్యత్తులో ప్రజల అవసరాలను గుర్తించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేకు ప్రజల తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య, మండల సీనియర్ నాయకులు, గౌడ సంఘం మండల అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకులు చిలుముల రాజమౌళి, గుర్రం నరసయ్య, గుర్రపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE