e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, October 26, 2026

చదువు తోనే ఉజ్వల భవిష్యత్తు: ఎస్పీ అఖిల్ మహాజన్

22 సీసీటీవీ కెమెరాలు ప్రారంభం.. ఆదివాసీలకు ఉచిత వైద్య సేవలు, యువతకు హెల్మెట్ల పంపిణీ

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి గొంటి ముక్కుల ప్రసాద్: అక్టోబర్ 26,

ఆదివాసీ గ్రామాల్లో ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు భద్రత, ఆరోగ్యం, విద్య, యువత అభివృద్ధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో తాంసి మండలం గిరిగామ గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ హాజరయ్యారు.

గిరిగామ గ్రామానికి చేరుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్‌కు గ్రామస్థులు డప్పు వాయిద్యాలు, గుస్సాడి నృత్యంతో స్వాగతం పలికారు. అనంతరం 86వ కొమురం భీమ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ ప్రజల కోసం ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆరుగురు వైద్య నిపుణులు శిబిరంలో సేవలందించారు.

22 సీసీటీవీ కెమెరాల ప్రారంభం

గ్రామాల్లో నేరాల నియంత్రణ, అనుమానాస్పద కార్యకలాపాల గుర్తింపు, ప్రజల భద్రతకు ఉపయోగపడేలా మూడు గ్రామాల్లో మొత్తం 22 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. కప్పర్ల గ్రామంలో 13, పొన్నారి గ్రామంలో 5, గోట్కూరి గ్రామంలో 4 సీసీటీవీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు.

యువతకు హెల్మెట్లు.. క్రీడాకారులకు ప్రోత్సాహం

రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడంలో భాగంగా ద్విచక్ర వాహనదారులకు 10 హెల్మెట్లను పంపిణీ చేశారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ పోటీల విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు.

మొదటి స్థానంలో నిలిచిన గోట్కూరి గ్రామ జట్టుకు రూ.3,500 నగదు, ట్రోఫీ, రెండో స్థానంలో నిలిచిన తాంసి గ్రామ జట్టుకు రూ.2,000 నగదు, ట్రోఫీ, మూడో స్థానంలో నిలిచిన కప్పర్ల గ్రామ జట్టుకు రూ.1,500 నగదు, ట్రోఫీ అందించారు.

గంజాయికి దూరంగా ఉండాలి

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ప్రమాదాల నివారణలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

గంజాయి సాగు, విక్రయాలు, వినియోగానికి యువతతో పాటు ప్రజలందరూ దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. గంజాయి సాగు, విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా సంబంధిత అధికారులకు సిఫారసు చేసే అవకాశం ఉందని తెలిపారు.

సరిహద్దు ప్రాంతాల నుంచి దేశీదారు అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఆరోగ్యానికి హానికరమైన మద్యం సేవనానికి దూరంగా ఉండాలని సూచించారు.

ఆదివాసీ యువత చదువుపై దృష్టి పెట్టాలి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని చదువులో రాణించాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని కోరారు. విద్య ద్వారా మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని, ముఖ్యంగా ఆదివాసీ యువత విద్యకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని అన్నారు.

ఆరోగ్య సమస్యలకు నకిలీ బాబాలు, మంత్రాలు, తంత్రాలను ఆశ్రయించకుండా అర్హత కలిగిన ప్రభుత్వ లేదా ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని సూచించారు. వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా 10 కంటి అద్దాలు అందించారు.

చదువు తోనే ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుంది అని ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్తులను గుర్తించడంలో పోలీసులకు సహకారం లభిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు పోలీసులతో సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు భాగస్వాములు కావాలని కోరారు. చదువు తోనే ఉజ్వల భవిష్యత్తు ఏర్పడ

కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ సీఐ రహీం పాషా, ఎస్ఐ ఎస్. జీవన్ రెడ్డి, మండల నాయకులు ఆత్రం భరత్, గ్రామ సర్పంచ్ దారుట్ల మీరాబాయి, ఆత్నగూడా సర్పంచ్ సంజీవ్,అంబుగామ సర్పంచ్ యశ్వంత్ రావు,లీంగుడ సర్పంచ్ శంభు ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామస్థులు, వైద్యులు నవీన్ రెడ్డి, రోజా రాణి, రవికాంత్, శ్వేత, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE