e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, October 27, 2026

రైతులకు ఉచితంగా ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కల పంపిణీ

రైతులకు ఉచితంగా ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కల పంపిణీ

మన భారత్, తలమడుగు: అక్టోబర్ 26, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కేశవపూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఆగ్రో ఫారెస్ట్రీపై అవగాహన కల్పిస్తూ ఉచితంగా వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పండ్ల తోటల పెంపకానికి ఉపయోగపడే పలు రకాల మొక్కలను రైతులకు అందజేశారు.

వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగు చేయగల పంటలు, మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని సంస్థ ప్రతినిధులు సూచించారు. పండ్ల తోటలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని వివరించారు.

వ్యవసాయ భూముల విస్తరణ కోసం అడవులను నరికివేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. అడవుల పరిరక్షణతో పాటు వ్యవసాయ భూముల్లోనూ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని రైతులకు సూచించారు. ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని అవలంబించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా పచ్చదనాన్ని పెంచవచ్చని తెలిపారు.

మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ, నీటి వినియోగం, పెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కేశవపూర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు స్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE