e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

కొండా సురేఖ బీసీ బిడ్డ కాబట్టే బలి..కోమటిరెడ్డి రెడ్డి కాబట్టే సేఫ్ – వేముల మహేందర్ గౌడ్

కొండా సురేఖ బీసీ బిడ్డ కాబట్టే బలి..కోమటిరెడ్డి రెడ్డి కాబట్టే సేఫ్ – వేముల మహేందర్ గౌడ్

మొగుళ్ళపల్లి: నవంబర్ 23,(మన భారత్):

కాంగ్రెస్ పార్టీలో బీసీల బతుకులు బలిపశువుల బతుకులయ్యాయా? అంటూ బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. ఒక బీసీ బిడ్డ కుటుంబం వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే తల్లిని మంత్రి పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని రోజూ తిడుతుంటే అతని సోదరుడు వెంకటరెడ్డిని ఎందుకు గుండెల్లో పెట్టుకుని ఊరేగుతోందని నిలదీశారు. ఇది క్రమశిక్షణ కాదు, కక్ష సాధింపు. ఇది పార్టీ రూల్ కాదు, బీసీల నోరు నొక్కే రూల్. కొండా సురేఖ బీసీ కాబట్టి బలి చేశారు, కోమటిరెడ్డి రెడ్డి కాబట్టి వదిలేశారు. ఈ డబుల్ స్టాండర్డ్ ను బీసీలు గమనిస్తున్నారని అన్నారు. కూతురు మాట్లాడితే తల్లికి శిక్ష పడే న్యాయం బీసీలకేనా? తమ్ముడు మాట్లాడితే అన్నకు ప్రమోషన్ వచ్చే న్యాయం రెడ్లకేనా? అని ప్రశ్నించారు. బీసీలు ఇకనైనా మేల్కోకపోతే మన మంత్రి పదవులు కాదు, మన అస్తిత్వమే ఊడిపోతుంది. హక్కులు అడిగితే తొక్కేస్తారు, కొట్లాడి లాక్కోవాలి. ఎన్నికలకు ముందు బీసీల జపం చేసి, బీసీల ఓట్లను దండుకుని అధికారంలోకి వచ్చాక బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE