ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

Published on

-Advertisement-

విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో విఘ్నాలన్ని తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

-శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదన్ చారి

మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 23, (మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మంగళవారం పర్యటించారు. మండల కేంద్రంలోని శ్రీ సాంబమూర్తి సామూహిక దేవాలయాన్ని సందర్శించి..వినాయకుని సేవలో పరితపించారు. అనంతరం ముదిరాజ్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాన్ని సందర్శించి యువకులతో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విగ్నేశ్వరుని కృపాకటాక్షాలతో విఘ్నాలన్ని తొలగిపోయి..ప్రజలంతా పాడి పంటలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు. బుధవారం నిర్వహించబోయే నిమజ్జనం సందర్భంగా..ప్రజలంతా భక్తి శ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రమాదాలు సంభవించకుండా..జాగ్రత్తలు పాటించి వినాయకుని నిమజ్జనం జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, మొగుళ్ళపల్లి మాజీ సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, మేదరమట్ల గ్రామం మాజీ సర్పంచ్ కొనుకటి అరవింద్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పడిదల మోహన్ రావు, అరికాంతపు అన్నారెడ్డి, పడిదల జగ్గారావు ,తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

సమస్యలను వెంటనే పరిష్కరించాలి..

మన భారత్,చిట్యాల: మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భూపాలపల్లి...

ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం.. 

జూకల్, మన భారత్: జూకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్–మ్యాథమెటిక్స్‌గా సేవలందిస్తున్న శ్రీమతి స్వరూప మారం...

నిమజ్జనోత్సవానికి పకడ్బందీ భద్రతా చర్యలు

గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ భద్రతా చర్యలు -మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి , సెప్టెంబర్ 23,(మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

ప్రశాంత నిమజ్జనానికి సహకరించాలి..

ప్రశాంత నిమజ్జనానికి సహకరించాలి -మొగులపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ వినాయక నిమజ్జన శోభాయాత్రలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జయశంకర్ భూపాలపల్లి...

More like this