ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం.. 

Published on

-Advertisement-

జూకల్, మన భారత్:

జూకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్–మ్యాథమెటిక్స్‌గా సేవలందిస్తున్న శ్రీమతి స్వరూప మారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. గణిత బోధనలో వినూత్న పద్ధతులు అవలంబిస్తూ, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, విద్యా రంగానికి అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.

ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి లలిత చేతుల మీదుగా స్వరూప మారం ఘనంగా సన్మానం పొందారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకోవడం పట్ల జూకల్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

గణితం అంటే కేవలం సంఖ్యలు, లెక్కలు మాత్రమే కాకుండా విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించే సాధనమని తన బోధన ద్వారా నిరూపిస్తున్న స్వరూప మారం, ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నారని పలువురు అభినందించారు.

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై అవార్డు అందుకున్న స్వరూప మారంకు జూకల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

మీ శీలపాక రాజు మన భారత్ రిపోర్టర్ చిట్యాల

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

సమస్యలను వెంటనే పరిష్కరించాలి..

మన భారత్,చిట్యాల: మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భూపాలపల్లి...

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో విఘ్నాలన్ని తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి -శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదన్ చారి మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 23, (మన...

నిమజ్జనోత్సవానికి పకడ్బందీ భద్రతా చర్యలు

గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ భద్రతా చర్యలు -మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి , సెప్టెంబర్ 23,(మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

ప్రశాంత నిమజ్జనానికి సహకరించాలి..

ప్రశాంత నిమజ్జనానికి సహకరించాలి -మొగులపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ వినాయక నిమజ్జన శోభాయాత్రలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జయశంకర్ భూపాలపల్లి...

More like this