నిమజ్జనోత్సవానికి పకడ్బందీ భద్రతా చర్యలు

Published on

-Advertisement-

గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ భద్రతా చర్యలు

-మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్

మొగుళ్ళపల్లి , సెప్టెంబర్ 23,(మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల పరిధిలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గణేష్ ఉత్సవ కమిటీలు వీలైనంత త్వరగా పూజా కార్యక్రమాలను ముగించి, వెలుతురు ఉన్న సమయంలోనే విగ్రహాలను జాగ్రత్తగా నిమజ్జన ప్రదేశాలకు తరలించాలని సూచించారు. శోభాయాత్రలో చిన్నారులు, మహిళలు పాల్గొన్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై ప్రయాణించే చిన్నారులు ప్రమాదాలకు గురికాకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలను ఉత్సవ నిర్వాహకులు, కమిటీ సభ్యులు తప్పనిసరిగా పాటించాలని, పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేయాలని కోరారు. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా డీజేలు వినియోగించడం, బాణాసంచా కాల్చడం నిషేధం అని తెలిపారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను ముగించుకుని నిర్వహించే గణేష్ నిమజ్జన కార్యక్రమం మతసామరస్యానికి ప్రతీకగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్ఐ ముప్పు సురేష్ విజ్ఞప్తి చేశారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

సమస్యలను వెంటనే పరిష్కరించాలి..

మన భారత్,చిట్యాల: మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భూపాలపల్లి...

ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం.. 

జూకల్, మన భారత్: జూకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్–మ్యాథమెటిక్స్‌గా సేవలందిస్తున్న శ్రీమతి స్వరూప మారం...

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో విఘ్నాలన్ని తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి -శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదన్ చారి మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 23, (మన...

ప్రశాంత నిమజ్జనానికి సహకరించాలి..

ప్రశాంత నిమజ్జనానికి సహకరించాలి -మొగులపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ వినాయక నిమజ్జన శోభాయాత్రలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జయశంకర్ భూపాలపల్లి...

More like this