e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

పంచాయతీలకు శుభవార్త.. నిధులపై వెసులుబాటు.!

మన భారత్,మొగుళ్ళపల్లి:

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం మంచి శుభవార్తను అందించిందని మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం సర్పంచ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ఇకపై ట్రెజరీలో జమ చేయకుండా నేరుగా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ..పంచాయతీ రాజ్‌ చట్టం-2018 సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించడం అభినందనీయమన్నారు.

ఇప్పటి వరకు పంచాయతీల ఆదాయాన్ని ట్రెజరీలో జమ చేసిన అనంతరం అవసరాలకు నిధులు డ్రా చేసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపారు. తాజా నిర్ణయంతో గ్రామసభ తీర్మానం మేరకు నిధులను వినియోగించుకునే అవకాశం ఏర్పడటం వల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని తెలిపారు.

పంచాయతీలకు వచ్చే ప్రతి రూపాయి గ్రామాల అభివృద్ధికే ఉపయోగపడేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీరు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఇది మరింత ఉపయోగకరంగా మారుతుందన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE